యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద అధికార తెరాస, భాజపాలు ప్రచారం నిర్వహించటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పార్టీల మధ్య మాటలు పెరిగి ఒకరిపైనొకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు.
ఇరు పార్టీల గొడవతో పోలింగ్ కేంద్రం వద్ద ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొనటంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. తెరాస, భాజపా నాయకులను చెదరగొట్టి గొడవ సద్దుమణిగేలా చేశారు.
ఇదీ చూడండి: చరవాణులు భద్రపరిచి... పది రూపాయలు వసూలు చేసి