కరోనా నేపథ్యంలో దేవస్థానానికి ఆదాయాన్ని తెచ్చే పూజలు, వ్రతాలు ఆగిపోవడం వల్ల రాబడి తగ్గింది. ఆదాయం లేక రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లించడం భారంగా మారింది. సగం జీతాలతో కుటుబ పోషణ భారమవుతుందని.. మొత్తం బకాయిలు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.
లాక్‌డౌన్‌తో ఐదు నెలలుగా నిలిచిపోయిన పూజల నిర్వహణకు వీలు కల్పించాలని అన్నారు. అన్‌లాక్-4లో బాగంగా కేంద్రం రూపొందిస్తున్న మార్గదర్శకాల ప్రకారం మొక్కులు తీర్చుకునే సదుపాయాన్ని భక్తులకు కల్పించాలన్న ప్రతిపాదనలు దేవాదాయ శాఖ కమిషనర్‌కు వివరించారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కమిషనర్ తెలిపారు. ఈ తరుణంలో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, దర్శనాలకు తెర తీయాలన్న యోచన ఆ శాఖలో మొదలైనట్లు తెలుస్తుంది.
ఇవీచూడండి: వరవరరావు వైద్య నివేదికలు పరిశీలిస్తాం: ఎన్‌హెచ్‌ఆర్సీ