కరవుతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు పంటను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి.. ఇతర రాష్ట్రాలకు, దేశాలకు మన పంటలను ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం చేరుకుందని తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్, ప్రొడక్షన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని చేనేత కార్మికుడు శ్రీహరి నడుపుతున్న పట్టు దారాల ఉత్పత్తి పరిశ్రమను ఆయన సందర్శించారు. పరిశ్రమలో పట్టు పురుగుల నుంచి దారాలను తయారు చేసే ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను వినియోగించుకొని లాభాలను పొందాలని తెలిపారు.
రైతులు కేవలం అగ్రికల్చర్ పంటలే కాకుండా అధిక ఆదాయం వచ్చే హార్టికల్చర్, సెరీ కల్చర్ పంటలపై మొగ్గు చూపాలని సూచించారు. ప్రస్తుతం మలబార్ పంటల్లో అధిక లాభాలు ఉన్నాయని.. వాటిపై మొగ్గు చూపాలని తెలిపారు. సొంతంగా ఒక పరిశ్రమ పెట్టి 60 మందికి ఉపాధి కల్పిస్తున్న శ్రీహరిని జనార్దన్ రెడ్డి అభినందించారు.
ఇదీ చూడండి: పదమూడేళ్ల బాలికపై అత్యాచారం