ETV Bharat / state

చలించిన మంత్రి ఎర్రబెల్లి... అనాథ పిల్లలకు చేయూత - orphan children in atmakuru

ఆత్మకూరులో అమ్మానాన్నలు చనిపోయి అనాథలుగా మారిన ఆ చిన్నారుల వార్త చూసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చలించిపోయారు. వెంటనే వారికి సాయం అందేలా చూశారు.

telangana minister yerraballi dayakar rao helping to orphans in athmakuru yadadri bhaongir district
వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వ విప్
author img

By

Published : Aug 1, 2020, 9:55 PM IST

యాదాద్రి జిల్లా ఆత్మకూరులో అనాథ పిల్లల వార్త చూసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చలించిపోయారు. వెంటనే ఆత్మకూరు గ్రామ సర్పంచ్, ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో ఫొన్​లో మాట్లాడి వారికి తగిన సహాయం చేయాలని సూచించారు. అనంతరం ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఫోన్ చేసి ఆ పిల్లలను దత్తత తీసుకోవాలని కోరగా...ఆయన అందుకు అంగీకరించారు.

ఎమ్మెల్యే గొంగిడి సునీత పరామర్శ..

అమ్మానాన్నలు చనిపోయి అనాథలుగా మారిన ఆ చిన్నారులను పరామర్శించిన ఆలేరు ఎమ్మెల్యే.. తక్షణ సహాయంగా రూ. 15 వేలు ఆర్ధిక సహాయం అందజేశారు. అంతేకాకుండా చైల్డ్ వెల్ఫేర్ సంస్థ నుంచి ఇద్దరు పిల్లలకు ప్రతి నెల రూ. 2 వేలు అందేలా ప్రోసిడింగ్ అందజేశారు. తమకు పిల్లల్ని అప్పగిస్తే వాళ్ల చదువు, పెళ్లిళ్ల చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు.

ఇదీ చూడండి:ప్రముఖుల ట్విట్టర్​ ఖాతాలను ఎలా హ్యాక్ చేశారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.