యాదాద్రి భువనగిరి జిల్లాలో చలి పంజా విసురుతోంది. జనాలు స్వెటర్లు, మంకీ క్యాప్లతో దర్శనమిస్తున్నారు. వృద్ధులు శాలువాలు కప్పుకుంటున్నారు. ఇక యువత రకరకాల మోడళ్లతో లభ్యమవుతున్న స్వెటర్లు ధరించి న్యూలుక్‌తో కనబడుతున్నారు.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి విక్రయం
ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచే కాకుండా నేపాల్ నుంచి వచ్చిన వ్యాపారులు యాదగిరిగుట్ట చుట్టుపక్కల ప్రాంతాలలో రోడ్లపై దుకాణాలను ఏర్పాటు చేసుకుని విక్రయిస్తున్నారు.
సామాన్యులకు అందుబాటులోనే
ప్రస్తుతం మార్కెట్లో ఉన్ని దుస్తులు సామాన్య ధరలకే లభ్యమవుతున్నాయి. జిల్లాలో 100 నుంచి 600 రూపాయల్లో స్వెటర్లు దొరుకుతున్నాయి. పెద్ద దుకాణాల్లో నాణ్యమైన స్వెటర్లు, రెయిన్కోట్లు, జర్కిన్లు 500 నుంచి 1200 రూపాయల్లో లభ్యమవుతున్నాయి.
వారికి ఇవే జీవనాధారం
యాదగిరిగుట్టతో పాటు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు దుణాకాలు ఏర్పాటు చేసుకుని అందులో దుప్పట్లు, బ్లాంకెట్లు, స్వెటర్లు, జర్కిన్లు స్టోర్ చేశారు. వాటిని సమీపంలోని గ్రామాల్లో తిరుగుతూ వ్యాపారం సాగిస్తున్నారు. తమకు ఇదే జీవనాధారమని వ్యాపారులు చెబుతున్నారు.
తగిన జాగ్రత్తలు తప్పనిసరి
శీతాకాలంలో చలిబారిన పడితే శ్వాసకోస సంబంధవ్యాధులు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: చిత్రకళలో ఔరా అనిపించిన అంధులు