ETV Bharat / state

యాదాద్రిలో భారీ స్వాగత తోరణం.. వార్షిక బ్రహ్మోత్సవాలకి సిద్ధం - యాదాద్రిలో స్వాగత తోరణం

Swagatha Thoranam in Yadadri: యాదాద్రి భక్తులకు స్వాగత తోరణాలు ఇక నుంచి స్వాగతం పలకనుంది. ఈ స్వాగత తోరణం వచ్చే ఫిబ్రవరి జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు నాటికి సిద్ధం కానుంది. వైటీడీఏ స్వాగత తోరణం నిర్మాణం పట్ల ప్రత్యేక దృష్టి సారించింది.

swagatha thoranam
స్వాగత తోరణం
author img

By

Published : Jan 10, 2023, 11:18 AM IST

Swagatha Thoranam in Yadadri: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో నిర్మితమవుతున్న భారీ స్వాగత తోరణం వచ్చే ఫిబ్రవరి జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లోగా ఆవిష్కృతం కానుంది. ఈ తోరణం కృష్ణ శిలను పోలిన రంగు శిలలతో రూపుదిద్దుకోనుంది. కొండపైన కనుమ దారులను కలుపుతూ, వాటి మధ్య 40 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో ఈ తోరణం నిర్మించారు. ఈ క్షేత్రాభివృద్ధికి సంకల్పించిన సీఎం కేసీఆర్.. ఆలయ సన్నిధిలో చేపట్టే నిర్మాణాలన్నీ ఆధ్యాత్మికతను చాటేలా ఉండాలన్న సూచనతో వైటీడీఏ స్వాగత తోరణం నిర్మాణం పట్ల ప్రత్యేక దృష్టి సారించింది.

కనుమదారిలో నిర్మితమైన భారీ స్వాగత తోరణం
కనుమదారిలో నిర్మితమైన భారీ స్వాగత తోరణం

దేశంలో మరెక్కడా లేని సంపూర్ణంగా కృష్ణశిలతో పునర్నిర్మితమైన పంచ నారసింహుల దివ్యాలయానికి తగ్గట్లు ఆలయ పరిసరాలలో ఇతర కట్టడాల నిర్మాణాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే సిమెంట్​తో భారీ స్వాగత తోరణం నిర్మించారు. ఇది యాదాద్రికి వచ్చే భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వైష్ణవతత్వం ఉట్టిపడేలా ఈ తోరణాన్ని ఏర్పాటు చేయనున్నారు.

రథోత్సవ దృశ్యంలో ఆలయ ఐరావతం, తీర్థజనుల మూర్తులు

స్వాగత తోరణంలో విశేషాలు: వైష్ణవతత్వం ప్రస్ఫుటించేలా కొండపైన పంచనారసింహుల ప్రాంగణానికి చేరే దిశలో కొండ దిగేపుడు తోరణంపైన వెనకా, ముందు శ్రీలక్ష్మీనరసింహస్వామి రూపం.. ఇరువైపులా గరుడాళ్వారుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలను ఏర్పరిచారు. మూడు పిల్లర్లతో నిర్మితమైన తోరణం ఇరువైపులా ద్వారపాలకులు, మధ్యలో మహావిష్ణు మూర్తి రూపం, కింది భాగంలో యక్షులు దర్శనమిస్తారు. ఇక స్వాగత తోరణం కుడివైపున రక్షణ గోడపైన ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లోని దివ్యవిమాన రథోత్సవ వేడుక సాదృశ్యమయ్యేలా ఐరావతం,తీర్థజనుల దృశ్యాలను తీర్చిదిద్దారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.