ETV Bharat / state

అనుకోకుండా వచ్చిన నీరు... అన్నదాతకు మిగిల్చింది కన్నీరు - మాదాపూర్​లో నీట మునిగిన పంట

అనుకోకుండా వచ్చిన నీరు ఆ రైతులను నట్టేట ముంచింది. చేతికందొచ్చిన పంట పీకలవరకు మునిగింది. పెట్టిన పెట్టుబడంతా నీటిపాలైంది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్​లోని జగ్గన్న చెరువులోకి వచ్చిన కొండపోచమ్మ సాగర్​ ప్రాజెక్టు నీరు... సుమారు 20 మంది రైతుల కళ్లలో నీటిని నింపింది.

yadadri
farmar
author img

By

Published : Apr 20, 2021, 7:21 PM IST

అనుకోకుండా వచ్చిన నీరు... అన్నదాతకు మిగిల్చింది కన్నీరు

కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నీళ్లు వస్తే పంటలు సంవృద్ధిగా పండుతాయనుకుంటే... అనుకోకుండా వచ్చిన నీళ్లు ఆ రైతులకు కన్నీటిని మిగిల్చాయి. కోతదశకు వచ్చిన పంట పీకల్లోతు నీటిలో మునిగిపోవడం వల్ల రైతుల గుండెలు చెరువులయ్యాయి. యాదాద్రి భువనగిరిజిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్​లోని జగ్గన్న చెరువు పరిసరాల్లోని పంటలు నీట మునిగాయి. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి చెరువులోకి భారీగా వచ్చిన నీరు పంటను ముంచెత్తింది. చివరిదశలో ఉన్న పంటను కోసుకోలేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముందే చెప్పుంటే జాగ్రత్త పడేవాళ్లం

దుక్కి దున్ని పంట వేసిన నాటి నుంచి ఇప్పటి వరకు... నీళ్లు వస్తాయని ఎవ్వరూ... ఎప్పుడూ చెప్పలేదని రైతులు వాపోతున్నారు. ముందే చెప్పుంటే పంటలు వేసుకునే వాళ్లమే కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికందొచ్చిన పంట మునిగిపోయిందని.. పెట్టిన పెట్టుబడంతా గంగపాలైందని కన్నీటి పర్యంతమవుతున్నారు. సొంత భూముల్లో సాగుచేసుకుంటున్న వారితో పాటు... కౌలు రైతులకు అనుకోని కష్టం వచ్చిందని... అధికారులు తక్షణమే స్పందించి.. ప్రభుత్వం తరఫున తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: లైవ్​ వీడియో : ధాన్యం బస్తాల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.