ETV Bharat / state

యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన మహోత్సవం

యాదాద్రి పుణ్యక్షేత్రంలో నేడు ఏకాదశిని పురస్కరించుకొని లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. బాలాలయంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వివిధ రకాల పూలతో ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ పూజల్లో పాల్గొన్నారు.

author img

By

Published : Apr 7, 2021, 4:13 PM IST

sri lakshmi narasimha swamy laksha pushparchana, yadadri temple
లక్ష పుష్పార్చన కార్యక్రమం, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో స్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. బాలాలయంలో ఉదయం సుప్రభాత సేవతో మొదలైన పర్వాలు, కవచ మూర్తులను ప్రత్యేక హారతులతో కొలిచారు. మండపంలో సుదర్శననారసింహ హోమం, నిత్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. నేడు ఏకాదశిని పురస్కరించుకొని బాలాలయ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు.

ఈ లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ప్రతి నెల శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున నిర్వహించడం ఆనవాయితీ అని ఆలయ అర్చకులు తెలిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సుమారు గంటపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని... మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ఇదీ చదవండి: 'కీరాదోస'తో కోరినంత ఆరోగ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.