ETV Bharat / state

350 ఏళ్ల నాటి మెట్లబావికి పూర్వవైభవం.. చూసేందుకు రెండు కళ్లు చాలవు!!

ఎనభై అడుగుల లోతు... అరవై అడుగుల పొడవు... ముప్పై అడుగుల వెడల్పు... ఎటు చూసినా పురాతన రాతి శిలలే కనిపిస్తాయి. హైవే పక్కనే ఉన్నా... లోపలికి వెళ్తే ఆహ్లదకరమైన వాతావరణం. సాంకేతికత లేని రోజుల్లోనే నిర్మించిన అద్భుత కట్టడం. నిరాదరణకు గురై రూపురేఖలు కోల్పోయిన మెట్లబావి... ప్రభుత్వం చొరవతో తిరిగి జీవం పోసుకుంది.

Special story on Chowtuppal 350-Year-Old Stairwell
350 ఏళ్ల నాటి మెట్లబావికి పూర్వవైభవం.. చూసేందుకు రెండు కళ్లు చాలవు!!
author img

By

Published : Apr 24, 2022, 7:29 AM IST

చుట్టూ రాతి కట్టడం, దారిపొడవునా మెట్లు, అవన్నీ దాటి వెళ్తే నీరు... అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణం. ఇదంతా యాదాద్రి జిల్లా చౌటుపల్లి పరిధి లింగోజిగూడెంలో... హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఉంది. మూడున్నర శతాబ్దాల క్రితం నిర్మించిన దిగుడుబావికి... పురాతన కట్టడంగా ప్రత్యేక పేరుంది. 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 80 అడుగుల లోతులో నిర్మించారు. 60 అడుగుల వరకు మెట్లు నిర్మించారు. మెట్లబావిని పూర్తిగా రాయితోనే నిర్మించారు. చెత్త, చెదారం పేరుకుపోయి... పిచ్చిమొక్కలతో నిండిపోయిన ఈ మెట్లబావిని... హెచ్​ఎండీఏ ప్రత్యేక దృష్టిసారించి అభివృద్ధి చేసింది.

350 ఏళ్ల నాటి మెట్లబావికి పూర్వవైభవం.. చూసేందుకు రెండు కళ్లు చాలవు!!

బావిలో ప్రత్యేక గదులు: కొన్నేళ్ల క్రితం ఈ బావి 15 గ్రామాలకు తాగునీటి అవసరాలు తీర్చేది. ఇటుగా వెళ్లే బాటసారులకూ నీడనిచ్చేది. ఒకప్పుడు గోసాయిమఠంగా పిలవబడిన ఈ ప్రాంతంలో... అప్పటి పాలకులు వారికి అనుగుణంగా ఇక్కడ విశ్రాంతి, విడిది కేంద్రాన్ని నిర్మించుకున్నారు. దాదాపు ఐదు అంతస్తులతో నిర్మించిన ఈ బావిలో... స్నానాలు చేసినవారు దుస్తులు మార్చుకునేందుకు... భూమి నుంచి 25 అడుగుల దిగువన.... ప్రత్యేక గదులను నిర్మించారు.

అప్పుడు ఈ బావిలో చెట్లు చెదారం ఉండేది. ప్రభుత్వం పట్టించుకోని అద్భుతంగా తీర్చిదిద్దారు. దీన్ని అందరూ సందర్శించి.. ఇంకా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. పునర్ వైభవం తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి.

- స్థానికుడు

బావిని పర్యాటకంగా అభివృద్ధి: ఫిబ్రవరిలో ఈ బావిని సందర్శించిన ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ ఛైర్మన్‌ శివనాగిరెడ్డి... బావి పునరుద్ధరణ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌ బావిని అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మెట్లబావిని పునరుద్దరించిన తర్వాత.... పాత, కొత్త ఫోటోలను ట్విటర్‌లో పంచుకున్నారు. మెట్లబావి అభివృద్ధి పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బావిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు పురావస్తుశాఖతోపాటు... పురపాలకశాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.