యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి పుణ్య క్షేత్రంలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా రెండో రోజు స్వామివారు వేణుగోపాలస్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బాలాలయ తిరువీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.
ప్రత్యేకమైన పూలు, వజ్రాభరణాలతో స్వామివారిని అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. లోక కల్యాణం కోసం నారసింహుడు వేణుగోపాలస్వామి అవతారం ఎత్తారని తెలిపారు.
ఇదీ చదవండి: 'రైతు లేనిదే వ్యవసాయం లేదు.. సాగు లేనిదే తెలంగాణ లేదు'