తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పట్టింది. ఆలయంలోని క్యూలైన్లు, వ్రత మండపాలు, కల్యాణకట్ట పుష్కరిణి ప్రాంతం భక్తులతో సందడిగా మారాయి. ప్రతిరోజు జరిపే నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున కొండపైకి వాహనాలను అనుమతిని పోలీసులు నిరాకరించారు.
ఇవీ చూడండి: అలర్ట్: ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల