యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం నెమరుగోముల గ్రామ శివారులో బీబీనగర్ పోలీసులు పేకాట ఆడుతున్న ఆరుగురుని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1310 రూపాయల నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నెమరుగోముల గ్రామానికి చెందిన పవన్, దూసరి రాజేష్, చేగూరి వేణు, దేవరకొండ మహిపాల్, పల్లపు యాదగిరి, ఆలకుంట్ల శ్రీకాంత్‌లుగా గుర్తించారు.
ఇవీ చూడండి: కరోనా వైరస్‌పై ప్రత్యేక గీతం... ఆవిష్కరించిన కేటీఆర్