ETV Bharat / state

కరోనా వైరస్​పై​ ప్రత్యేక గీతం... ఆవిష్కరించిన కేటీఆర్ - కరోనాపై ప్రత్యేక గీతం విడుదల చేసిన కేటీఆర్

కరోనా వైరస్​ వ్యాప్తి నివారణలో భాగంగా పనిచేస్తున్న వివిధ సిబ్బంది సేవలను గుర్తిస్తూ... జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి ఈ ప్రత్యేక గీతాన్ని నిర్మించారు. ఈ గీతాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.

Minister ktr released Special song on corona
కరోనా వైరస్​పై​ ప్రత్యేక గీతం.
author img

By

Published : Apr 28, 2020, 5:42 PM IST

కరోనా వైరస్​పై ప్రత్యేక గీతాన్ని మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. కొవిడ్​-19ను కట్టడి చేయడంలో కీలకపాత్ర వహిస్తున్న వివిధ శాఖల సిబ్బంది సేవలను గుర్తిస్తూ.. జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి ఈ ప్రత్యేక గీతాన్ని నిర్మించారు. ఈ గీతాన్ని ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ ఆలపించగా... కందికొండ సాహిత్యాన్ని అందించారు. ఈ ప్రత్యేక గీతం చాలా బాగా వచ్చిందని కచ్చితంగా ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వైరస్ కట్టడి కోసం పనిచేస్తున్న వారి పట్ల గౌరవాన్ని పెంచుతుందన్నారు. ఈ పాటను నిర్మించిన బొంతు శ్రీదేవితో పాటు మేయర్ రామ్మోహన్‌ను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.

కరోనా వైరస్​పై​ ప్రత్యేక గీతం

ఇవీ చూడండి: '200 కిలోమీటర్లు... 6 ఆసుపత్రులు... దరిచేరని తల్లి ప్రయాణం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.