ETV Bharat / state

ఇక్కడ శివరాత్రికి కాదు, ఈరోజే శివపార్వతుల కల్యాణం

తూర్పున కాకుండా పడమర ముఖద్వారం.. శివరాత్రి రోజున కాకుండా హోలీ రోజు శివపార్వతుల కల్యాణం... ఈ తతంగమంతా పూర్తయ్యాకే.. రంగుల సందడి మొదలవుతుంది. ఇదేంటి వింతగా ఉంది ఎక్కడో అనుకుంటున్నారా..! మన యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరులో.

author img

By

Published : Mar 21, 2019, 1:51 PM IST

రారండో వేడుక చూద్దాం
రారండో వేడుక చూద్దాం
మోత్కూరు కేంద్రంలో శ్రీ రామలింగేశ్వరుని ఆలయానికి రెండు ప్రత్యేకతలున్నాయి. ఒకటి అన్ని దేవాలయాల ముఖద్వారం తూర్పుముఖంతో ఉంటే ఇక్కడ మాత్రం పడమర దిక్కున ఉంటుంది. రెండోది శివరాత్రి రోజు జరగాల్సిన శివ పార్వతుల కల్యాణం కాముని పున్నమి తర్వాత అంటే హోలీ రోజు జరుగుతుంది.

ఇక్కడిలా భిన్నంగాజరగడానికి ఒక పురాణ గాథ ప్రచారంలోఉంది. శివుని తపస్సు భగ్నం చేసేందుకు మన్మథుడు ప్రేమబాణం సంధించడం... ముక్కంటి ఆగ్రహానికి గురై దహనమైపోతాడు. అందుకు గుర్తుగా కామదహనం జరుపుకుంటారు. అర్థనారీశ్వరుల కోసమే కాముడు అగ్నికి ఆహుతయినందున... కామదహన వేళలోనే వారి కల్యాణం సముచితమని స్థానికుల అభిప్రాయం. ప్రతీ ఏటా హోలీ రోజు ఈ వైభవం జరిపిన తర్వాతే రంగుల పండుగ జరుపుకుంటారు.

ఇదీ చదవండి:హోలీరే హోలీ... భారతమంతా రంగుల మయం

Intro:Contributor: Anil
Center :Tunga tirigi
Dist :Suryapet.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఈ రోజు ఉదయం శ్రీ రామలింగేశ్వరుని కళ్యాణం ఘనంగా నిర్వహించి హోళి పండుగను జరుపుకున్నారు.
అన్నిదేవాలయాలు ముఖద్వారం తూర్పుముఖము ఉంటాయి కాని ఈ రామలింగేశ్వరుని దేవాలయం మాత్రం అందుకు భిన్నంగా పడమర ముఖద్వారం ఉంటుంది . శివ పార్వతుల కళ్యానం శివరాత్రి రోజు న దేశం అంతట జరిగితే మోత్కూరు లో మాత్రం అందుకు భన్నంగా కాముని పున్నమి తరువాత రోజున జరుతుంది. ఇలా ఎందుకు అనగా పర్వత రాజు కుమార్తె అయిన పార్వతి శివుని భర్తగా పొందడానికి తపస్సు చేస్తున్న సమయంలో నారదుడు వచ్చి పార్వతి తో శివుడు లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తున్నాడని తపోనిష్ఠలో ఉన్న శివునికి సపర్యలు చేయడం వల్ల శివుడు మోహించి నిన్ను భార్యగా స్వీకరిస్తాడని సలహా ఇవ్వండంతో పార్వతి శివుని కి సపర్యలు చేస్తున్న సమయంలో ఒక సుముహూర్తాన ఇరువురి చూపులు కలుసుకుంటాయి ఒకరంటే ఒకరికి అనురాగం అంకురించే వేళలోనే ఇదే అదనుగా భావించిన కాముడు (మన్మధుడు) వారిరువురి పై పూల బాణం ప్రయోగిస్తాడు. తమ ఏకాంతం భంగం కలిగించిన అపరాధానికి కోపించిన శివుడు మూడో కన్ను తెరవడం మన్మధుడు ఆ మూడవ నేత్రాగ్నికి ఆహుతి కావడం ఒకేసారి జరుగుతాయి ఈ దహనం కామదహనం గా మనం జరుపుకుంటాం శివపార్వతుల కళ్యాణ నేపథ్యం కనుక కామదహన వేలలోనే శివపార్వతుల కళ్యాణం సముచితమని మోత్కూర్ ప్రాంతం వారి అభిప్రాయం . శివపార్వతుల కళ్యాణం అనంతరం ఈ గ్రామంలో హోళి పండుగను జరుపుకోవడం ఇక్కడి ఆనవాహితి.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.