యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి అనుబంధ ఆలయంలో నేటి నుంచి శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ సిబ్బంది పేర్కొన్నారు.
మొదటిరోజు స్వస్తివాచనంతో వేడుకలు ప్రారంభించనున్నారు. తొమ్మిదొ తేదీన ధ్వజారోహణం, భేరి పూజ, దేవతాహ్వానం, 10న రుద్రాహావనం అదే రోజు రాత్రి స్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నారు.
11న అభిషేకం, రాత్రి లింగోద్బవ మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 12న ఉదయం లక్ష భిల్వార్చన, రాత్రి రధోత్సవం, 13న పూర్ణాహుతి, డోలోత్సవం చేపట్టి ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి : ఘనంగా ఆటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు