యాదాద్రి పుణ్యక్షేత్రం (Yadadri Temple) సందర్శనలో ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని కలిగించేందుకు ఆలయాలు, పరిసరాలు అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో కొండ కింద గిరి ప్రదక్షిణ దారిని హరిత మయంగా మారుస్తున్నారు. ఓ పెద్ద బండపై వటపత్ర ఆకు నమూనా ఆకారం గిరి ప్రదక్షిణ దారిలో ఆకుట్టుకుంటోంది.
నూతనంగా కొండ కింద ఉత్తర దిశలో ఉన్న ఆ బండపై వటపత్రం రూపం ఏర్పాటుకు పనులు చేపట్టారు. యాదాద్రీశుడికి భక్తులు గిరిప్రదక్షిణ చేసే దశలో రానున్న క్రమంలో… మానసిక ఆనందం, భక్తి తత్వం పొందేలా… ఆ దారిని నక్షత్రవనం, ఔషధ మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
సీఎం కేసీఆర్ సూచనలతో ఆ దారి క్షేత్ర స్థాయికి తగ్గట్లు ఉండాలని "యాడా"శ్రమిస్తోంది. వటపత్రం ఆకారంలో తీర్చిదిద్దే క్రమంలో దాదాపు ముప్పావు ఎకరంలో రాగి పత్రం ఆకారంలో పుణే నుంచి ప్రత్యేక మొక్కలు తెప్పించినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: Yadadri Temple: విశాల రహదారులు.. హరిత ప్రాంగణాలు