ETV Bharat / state

విత్తన సరఫరా కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే - yadadri News

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్​ పోచంపల్లి మండలంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి విత్తనాలు, ఎరువుల సరఫరా కేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతీ రైతుకు ఎరువులు, విత్తనాలు అందిస్తామని.. రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Seeds Supply Center Opens In Bhudan Pochampally
విత్తన సరఫరా కేంద్రాలు ప్రారంబించిన ఎమ్మెల్యే
author img

By

Published : May 30, 2020, 9:20 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్​ పోచంపల్లి మండల పరిధిలోని జూలూర ప్రాథమిక సహకార సంఘం పరిధిలో ఎరువులు, విత్తనాల సరఫరా కేంద్రాలను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​ రెడ్డి ప్రారంభించారు. జూలూరు పరిధిలోని పిల్లాయిపల్లి, జగత్​పల్లి, పెద్ద రావులపల్లి గ్రామాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.

రైతులకు వానకాలం సాగుకు కావాల్సినవన్నీ ఆయా గ్రామాల్లోనే దొరుకుతాయని, రైతులు కంగారు పడి.. ఇతరుల దగ్గర విత్తనాలు, ఎరువులు కొని మోసపోవద్దని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్​ రెడ్డి, జూలూరు పీఏసీఎస్ ఛైర్మన్​ లింగం యాదవ్​, పోచంపల్లి మున్సిపల్​ ఛైర్మన్​ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్​, రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: తెలంగాణపై కరోనా పంజా... నిన్న ఒక్కరోజే 169 కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.