ఏప్రిల్ 2న భువనగిరిలో కేసీఆర్ సభ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 2న భువనగిరి పట్టణంలో నిర్వహించనున్న తెరాస సభకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్లశేఖర్ రెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జీ, ఎంపీబడుగు లింగయ్య యాదవ్‌తో కలిసి సభా స్థలిని పరిశీలించారు. సభకు భారీగా నాయకులు, కార్యకర్తలు రానున్న నేపథ్యంలో అందుకు తగట్టుగా ఏర్పాట్లు చేయాలని కార్యకర్తలను ఆదేశించారు.
ఇవీ చూడండి:శరత్... నేను కేసీఆర్‌ను మాట్లాడుతున్నా...!