యాదగిరిగుట్టలో ఆర్టీసీ కార్మికుల అరెస్టు.. నెలకొన్న ఉద్రిక్తత యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ముప్పై మూడో రోజుకు చేరింది. బస్సు డిపో గేటు ముందు ధర్నా చేశారు. సమ్మెకు సంఘీభావంగా వామపక్ష పార్టీలు పాల్గొన్నాయి. బస్సులు బయటికి వెళ్లకుండా డిపో గేటు ముందు కార్మికులు బైఠాయించారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదన్నారు. సీఎం కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని కార్మికులు, నాయకులు తెల్చిచెప్పారు. ఆర్టీసీ కార్మికులు, వామపక్ష పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి.. ఠాణాకు తరలించారు. కార్మికులు సహకరించకపోనందున కొంత మేర ఉద్రిక్తత నెలకొంది. బస్సులను అడ్డుకున్న కార్మికులను పోలీసులు తొలగించి వాహనాలను పంపిచేశారు.
ఇదీ చదవండిః ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన విజయారెడ్డి అంత్యక్రియలు