ETV Bharat / state

ఫోన్ ట్యాపింగ్ కేసులో నేతల విచారణ షురూ - నకరేకల్ మాజీ ఎమ్మెల్యే తరువాత నెక్ట్స్ ఎవరు? - BRS LEADERS IN PHONE TAPPING CASE

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం - నిందితుల కాల్​డేటా ఆధారంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు - ఈనెల 14న వస్తానని చిరుమర్తి ప్రకటన

Investigation of leaders in phone tapping case
Investigation of leaders in phone tapping case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 11, 2024, 6:12 PM IST

Updated : Nov 11, 2024, 6:38 PM IST

BRS Leaders Investigation in Phone Tapping Case : ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకూ అధికారులను మాత్రమే విచారించిన దర్యాప్తు బృందం తొలి సారి బీఆర్‌ఎస్‌ నేత, నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు పంపారు. నేడు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపంగా మధ్యాహ్నం 2.30కి హాజరవుతానని ముందుగా తెలిపారు. కానీ అనారోగ్యంగా ఉందని ఈనెల 14 విచారణకు హాజరవుతానని దర్యాప్తు అధికారి అయిన జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి సమాచారం ఇచ్చారు.

కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకూ నలుగురు నిందితులైన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా నలుగురి నిందితుల ఫోన్లను ఎఫ్‌ఎస్​ఎల్​కి పంపించి విశ్లేషించారు. అక్కడి నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా నిందితులు తరచూ పలువురు ప్రముఖులతో ఫోన్ కాల్ మాట్లాడినట్లు గుర్తించారు. మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్న ఫోన్​లో లింగయ్య కాల్ డేటా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఫోన్​ ట్యాపింగ్ కేసులో నకరేకల్ మాజీ ఎమ్మెల్యే! : ఈ డేటా ఆధారంగా చిరుమర్తి లింగయ్యను విచారించేందుకు నోటీసులు పంపారు. నిందితుల ఫోన్​లో పదుల సంఖ్యలో ప్రముఖుల కాల్‌ డేటా ఉన్నట్లు సమాచారం. వీటి ఆధారంగా ఒక్కొక్కరిని పిలిచి విచారించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు లింగయ్య విచారణ ఆధారంగా మరికొంత మందిని కూడా పోలీసుల విచారించనున్నారు. మొత్తానికి దర్యాప్తు బృందం తీసుకున్న ఈ నిర్ణయం బీఆర్​ఎస్ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. తదుపరి నోటీసులు ఎవరికి వస్తాయా అని చర్చ మొదలైంది. మరోవైపు ఈ నోటీసులపై బీఆర్​ఎస్ ఇంతవరకు స్పందించలేదు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వెలుగుచూసిన ఈ స్కామ్​లో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్​ఐబీ మాజీ ఓఎస్​డీ టి.ప్రభాకర్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. చికిత్స కోసం 8నెలల క్రితమే అమెరికా వెళ్లిన ఆయన తన రాకను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇటీవలే ఆయనకు అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరైనట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అమెరికాలోనే స్థిరపడిన ఆయన ఫ్యామిలీ మెంబర్స్​ స్పాన్సర్‌షిప్‌తో ప్రభాకర్‌రావుకు గ్రీన్‌కార్డు మంజూరైందని సమాచారం.

ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్​ రావును వెనక్కి తీసుకురావడం ఎలా? - అమెరికాలో గ్రీన్‌కార్డుతో పోలీసులపై ఒత్తిడి!

15 రోజుల్లో 4500పైగా ఫోన్లు ట్యాపింగ్​ - వెలుగులోకి కీలక విషయాలు - TELANGANA PHONE TAPPING CASE UPDATE

Last Updated : Nov 11, 2024, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.