ETV Bharat / state

లారీ కింద ఇరుక్కుపోయి - కేంద్ర మంత్రి చొరవతో బయటపడి - ROAD ACCIDENT IN KARIMNAGAR

బైక్​పై వెళుతూ పడిపోయి లారీ కింద పడిపోయిన మహిళ - ములుగు జిల్లా వైపు వెళ్తూ ప్రమాదాన్ని చూసి ఆగిన బండి సంజయ్ - మహిళను రక్షించి ఆసుపత్రికి తరలింపు

ROAD ACCIDENT IN KARIMNAGAR DISTRICT
MINISTER BANDI SANJAY (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 11, 2024, 5:26 PM IST

Bandi Sanjay Saved The woman : బైక్​పై వెళ్తూ కిందపడి పోయి లారీ కింద ఇరుక్కుపోయి కేంద్రమంత్రి బండి సంజయ్ చొరవతో తృటిలో ప్రాణాలు దక్కించుకున్న మహిళ స్టోరీ ఇది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగాపూర్ శివారులో ఉదయం ఓ ప్రమాదం జరిగింది. కరీంనగర్​ జిల్లాలోని మానకొండూరు మండలం ఖెల్లడకు చెందిన దివ్యశ్రీ భర్తతో కలిసి హుజురాబాద్​లో పని చేసుకొని స్వగ్రామానికి వెళ్తోంది. బైక్​పై వెళ్తున్న సమయంలో కళ్లు తిరిగి రోడ్డుపై పడిపోయి వెనుక వస్తున్న లారీ కిందకు వెళ్లింది.

ఈ ఘటనలో ఆమె జుట్టు లారీ ముందు టైర్, రాడ్ల మధ్య ఇరుక్కుపోయింది. కేకలు వేయడంతో డ్రైవర్‌ లారీని ఆపేశాడు. అదే సమయంలో అటుగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ములుగు వెళుతూ ఘటనా స్థలి వద్ద ఆగారు. లారీ కింద టైర్‌ పక్కన రాడ్డులో జుట్టు చిక్కుకొని రక్తమోడుతూ వేళాడుతున్న దివ్యశ్రీని చూసి ధైర్యం చెప్పారు. ఇరుక్కుపోయిన జుట్టును కట్టర్ల సాయంతో కత్తిరించి దివ్యశ్రీని బయటకు తీయాలని అక్కడున్న వారికి సూచించారు. తరువాత రక్షించిన తరువాత కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి పంపించారు. దివ్యశ్రీ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని, మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు బండి సంజయ్‌ ఫోన్​లో చెప్పారు.

'అక్రమ నిర్మాణాలు కూల్చేస్తామన్న సీఎం - జన్వాడ ఫాంహౌస్​ను ఎందుకు కూల్చడం లేదు' - Bandi Sanjay on HYDRA

'అన్నంలో రాళ్లు వస్తుంటే ఏం చేస్తున్నారు? - మన పిల్లలకైతే ఇలాగే పెడతామా?' - CENTRAL MINISTER BANDI SANJAY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.