ETV Bharat / bharat

మణిపుర్​లో CRPF ఎన్​కౌంటర్- 11మంది మిలిటెంట్లు హతం - MANIPUR CRPF ENCOUNTER TODAY

మణిపుర్​లో సీఆర్​పీఎఫ్​ జరిపిన ఎన్​కౌంటర్​లో 11మంది అనుమానిత మిలిటెంట్లు మృతి

Manipur CRPF Encounter Today
Manipur CRPF Encounter Today (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 6:23 PM IST

Updated : Nov 11, 2024, 7:18 PM IST

Manipur CRPF Encounter Today : మణిపుర్​లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. జిరిబామ్‌ జిల్లాలో సీఆర్​పీఎఫ్ సిబ్బంది, మిలిటెంట్లకు మధ్య జరిగిన కాల్పుల్లో 11 మంది అనుమానిత మిలిటెంట్లు మృతి చెందారు. బోరోబెక్ర సబ్​ డివిజన్​లోని జాకురదోర్​ కరోంగ్​ వద్ద జరిగిన ఈ ఎన్​కౌంటర్​లో ఇద్దరు సీఆర్​పీఎఫ్​ సిబ్బందికి కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
అనుమానిత మిలిటెంట్ల మృతదేహాలను ఘటనాస్థలి నుంచి స్వాధీనం చేసుకుని బోరోబెక్ర పోలీస్​ స్టేషన్​కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం- భారీగా ఆధునాతన ఆయుధాలు కలిగిన మిలిటెంట్లు సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో బోరోబెక్ర పోలీస్​ స్టేషన్​పై కాల్పులు జరిపారు. అనంతరం ఆ పక్కనే ఉన్న సీఆర్​పీఎఫ్​ క్యాంపుపై దాడి చేశారు. ఆ తర్వాత కొంత మంది మిలిటెంట్లు- అక్కడికి 100 మీట్లర్ల దూరంలో ఉన్న జాకురదోర్​ కరోంగ్ మార్కెట్​లోని పలు దుకాణాలకు నిప్పంటించారు. పక్కనున్న కొన్ని ఇళ్లపై దాడి చేశారు. దీంతో సీఆర్​పీఎఫ్​ సిబ్బంది మిలిటెంట్లపైకి కాల్పులు జరిపారు.

సీఆర్​పీఎఫ్​ సిబ్బంది, మిలిటెంట్లకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్న క్రమంలో- పోలీస్టేషన్​ సమీపంలో ఉన్న సహాయక శిబిరంలోని ఐదుగురు పౌరులు కనిపించకుండా పోయారు. అయితే వారిని మిలిటెంట్లు కిడ్నాప్​ చేశారా లేదా కాల్పుల భయంతో ఎక్కడైనా దాక్కున్నారా అనే విషయంపై స్పష్టత లేదని అధికారులు చెప్పారు.
కాగా, ఈ ఘటన తర్వాత బీఎన్​ఎస్​లోని సెక్షన్​ 163 కింద స్థానికంగా నిషేదాజ్ఞలు విధించారు. ఈ మేరకు ఓ నోటిఫికేషన్​ జారీ చేశారు అధికారులు.

రైతులపై మిలిటెంట్లు కాల్పులు
మరోవైపు, సోమవారం ఉదయం 9.20 గంటలకు ఇంఫాల్​ ఈస్ట్​ జిల్లాలో పొలాల్లో పనిచేస్తున్న రైతులపైకి మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒక రైతుకు గాయం అయింది. సమాచారం అందిన వెంటనే భద్రతా దళాలు ఘటనాస్థలికి చేరుకుని మిలిటెంట్లపైకి కాల్పులు జరిపాయి. అనంతరం గాయపడిన రైతును స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరిలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు.

గత మూడు రోజులుగా కొండ ప్రాంతాల్లో నక్కిన మిలిటెంట్లు ఇంఫాల్​ లోయలోని పొలాల్లో పనిచేస్తున్న రైతులపైకి కాల్పులు జరుపుతున్నారు. దీంతో చాలా మంది రైతులు పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపడిపోతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడులు వరి పంటపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. కాగా, శనివారం చురచంద్​పుర్​ జిల్లాలో ఓ కొండపై నుంచి మిలిటెంట్లు కాల్పులు జరపడం వల్ల 34ఏళ్ల మహిళా రైతు మృతి చెందింది.

మణిపుర్ సీఎం కాన్వాయ్​పై ఉగ్రదాడి!- భద్రతా సిబ్బందికి గాయాలు - Manipur CM Convoy Attack

Last Updated : Nov 11, 2024, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.