యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
స్థానికులు గాయపడిన ఈ ముగ్గురిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఒక వ్యక్తిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా చెప్తున్నారు.
ఇదీ చూడండి: చటాన్‌పల్లిలో కిడ్నాప్ అయిన చిన్నారి లభ్యం