ETV Bharat / state

రేవంత్ వర్గీయుల సమావేశం.. ఉమ్మడి నల్గొండ​లో చర్చనీయాంశం..! - కాంగ్రెస్ నాయకుల సమావేశం

Revanth team meeting: ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకుల సమావేశం... పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రేవంత్ వర్గీయులు సమావేశం నిర్వహించడం పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం అందోల్‌ మైసమ్మ దేవస్థానం దగ్గర ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Revanth  team meeting
రేవంత్ వర్గీయుల సమావేశం
author img

By

Published : Apr 26, 2022, 10:23 PM IST

Revanth team meeting: వరంగల్ రాహుల్ సభ కోసం ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీపీసీసీ రేవంత్ రెడ్డి పర్యటనను సీనియర్లు అడ్డుకోవడంపై కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి అవసరం లేదనడంపై వారంతా ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వర్గీయులు అద్దంకి దయాకర్, దుబ్బాక నర్సింహారెడ్డి, పున్నా కైలాస్‌, పల్లె రవికుమార్‌లతోపాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు సమావేశమయ్యారు. రేవంత్‌ రెడ్డి పర్యటనను సీనియర్లు అడ్డుకోవడాన్ని ఖండించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం అందోల్‌ మైసమ్మ దేవస్థానం దగ్గర ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వందమందికిపైగా సమావేశమైన వీరంతా రేవంత్‌ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు కొందరు సీనియర్లు ప్రయత్నిస్తున్నారని రేవంత్‌ రెడ్డి వర్గీయులు ఆరోపించారు. వచ్చే నెల 6వ తేదీన వరంగల్‌లో తలపెట్టిన రాహుల్‌ సభకు జనసమీకరణ కోసం రేవంత్ పర్యటించాల్సి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని స్థానిక నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించి నియోజక వర్గాల వారీగా సమీక్ష చేయాల్సి ఉంది.

కానీ రేవంత్‌ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించాల్సిన అవసరం లేదని... ఇద్దరు సిట్టింగ్‌ ఎంపీలు ఉన్నందున మేమే చూసుకుంటామని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి చెప్పడాన్ని రేవంత్ వర్గీయులు ఖండిస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డితోపాటు మరికొందరు రేవంత్‌ రెడ్డి పర్యటనకు మద్దతు ఇస్తుండగా ఆయన వ్యతిరేకవర్గం మాత్రం పర్యటన అవసరం లేదని తేల్చి చెబుతున్నారు.

ఇవీ చూడండి: Group-1 Notification: గ్రూప్‌-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

TRS Plenary: తెరాస 21వ వార్షికోత్సవానికి సర్వం సిద్ధం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.