యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధర్నా చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్లు అమలు చేయాలని అధికారికి వినతి పత్రం అందజేశారు.
కరోనా ప్రారంభం నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం వల్ల ఆర్థిక లావాదేవీలకు చాలా నష్టం వాటిల్లిందని రియల్టర్లు ఆరోపించారు. దీనికి తోడు కొత్తగా వచ్చిన ధరణి పోర్టల్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని వాపోయారు. నూతన ధరణి విధానం వద్దు... పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ ముద్దు అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ప్రదర్శనలు నిర్వహించారు.
ఇదీ చూడండి: 'ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు'