యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు బీఎన్ తిమ్మాపురం వాసులు ఆందోళనకు దిగారు. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల తమ గ్రామంలో భూములు కోల్పోతున్న రైతులందరికీ ఒకేసారి పరిహారం చెల్లించాలని ధర్నా నిర్వహించారు. జిల్లా అధికారులు, రెవిన్యూ సిబ్బంది కొంతమంది రైతుల దగ్గర లంచాలు తీసుకుని.. భూములు కోల్పోని వారికీ పరిహారం మంజూరు చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
'1.5 టీఎంసీలకు సంబంధించి గ్రామంలోని వివిధ సర్వే నంబర్లకు చెందిన 150 ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. అందుకు ప్రొసీడింగ్ తయారు చేశారు. కానీ ఆ ప్రొసీడింగ్లో లేని ఇతర సర్వే నంబర్లలో ఉన్న వారికి పరిహారం ఎలా చెల్లిస్తారు' అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. అందరికీ ఒకేసారి పరిహారం చెల్లించకుంటే సోమవారం కలెక్టరేట్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: బిట్టు శ్రీను కస్టడీ కోసం మంథని కోర్టులో పోలీసుల పిటిషన్