యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహశీల్దార్ కార్యాలయం ముందు గొలనుకొండ గ్రామస్థులు ధర్నాకు దిగారు. నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు సంఘీభావం తెలిపారు.
గొలనుకొండలోని సర్వే నెంబర్ 42, 272ల్లో దాదాపు 300 మంది పేదలకు స్థలాలు కేటాయించి మళ్ళీ తిరిగి ఇవ్వమనడం వల్ల నిరసన తెలిపారు. ఇళ్ల స్థలాల సాధన కమిటీ నాయకులు కేటాయించిన స్థలాలు గ్రామస్థులవే అని రెవెన్యూ అధికారులు తెలుపగా.. ధర్నా విరమిస్తున్నట్లు స్థానికులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: గిరిజనుల అభ్యున్నతికి కృషి: గవర్నర్