ఈనెల 9న యాదాద్రి జిల్లా శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయం సమీపంలో పోలీస్ వాహనం ఢీ కొని గాయపడిన చిన్నారి ప్రణతి తుదిశ్వాస విడిచింది. హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 5:45 కి చిన్నారి మృతి చెందింది. చిన్నారి గుండె పని చేయడం లేదంటూ వైద్యులు తండ్రికి చెప్పారు. తర్వాత ప్రణతి మరణ వార్త వెల్లడించారు. చిన్నారి మృతి పట్ల కన్నీరు మున్నీరుగా విలపించారు కుటుంబ సభ్యులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు కారణమైన పోలీస్ రక్షక్ వాహన డ్రైవర్ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి: మూడేళ్ల పాపను ఢీకొట్టిన పోలీస్ వాహనం