మహిళల కళాత్మక నైపుణ్యానికి ముగ్గులు నిదర్శనమని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ ఛైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రి అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజా భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో "ముంగిట్లో ముగ్గులు" పేరుతో రంగోలీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ డాక్టర్ లక్ష్మీ నరసింహారెడ్డి, సినీగేయ రచయిత అభినయ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ప్రాశస్త్యం ఇనుమడించేలా
ముగ్గులు.. మహిళల మానసిక స్థితిని, వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయని నరసింహారెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగ గొప్పతనాన్ని, సంస్కతీ సంప్రదాయాలను రంగవల్లులు ప్రతిబింబిస్తాయని అభినయ శ్రీనివాస్ పేర్కొన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పది మందికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాభారతి సంస్థ అధ్యక్షులు టి. ఉప్పలయ్య, కార్యదర్శి మర్రి జయశ్రీ, బహుమతుల దాత కల్యాణ లక్ష్మి షాపింగ్ మాల్ యజమాని అల్లాడ సోమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మకర సంక్రమణ శోభ.. ఉత్తరాయణం ఆగమనం