ETV Bharat / state

యువకుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం జరిగిన రోడ్డుప్రమాదంలో మృతి చెందిన వారికి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతుల బంధువులకు అప్పగించారు. వీరందరూ ఘట్కేసర్​లోని హోలీ మేరీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. లాక్​డౌన్ నేపథ్యంలో కళాశాలలు తెరుచుకోలేదు. మిత్రులు అందరూ కలుసుకొని ఆలేరులో మిత్రుడు సాయి కిరణ్ సోదరి వివాహానికి హాజరై తిరుగు ప్రయణంలో రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డారు.

యువకుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
యువకుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
author img

By

Published : Dec 25, 2020, 2:20 PM IST

యాదాద్రి భువనగిరి కలెక్టరేట్​ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంతో భవిష్యత్ ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందడం అందరినీ కలచివేసింది. మృతుల కుటుంబాల్లో తీరని వేదనని మిగిల్చింది. ప్రమాదంలో రవి కిరణ్, కార్తిక్, వెంకటేశ్​ అక్కడికక్కడే మృతి చెందగా... ఆసుపత్రికి తరలిస్తుండగా కల్యాణ్ రెడ్డి మరణించాడు.

మృతుల వివరాలు...

మృతుల్లో రవికిరణ్ కుటుంబం మల్కాజిగిరిలోని ఇందిరానగర్​లో నివసిస్తోంది. రవి కిరణ్ తండ్రి 12 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, రవి కిరణ్ తల్లి ప్రైవేట్ టీచర్​గా పనిచేస్తూ కుమారుడు, కూతురును కష్టపడి చదివిస్తోంది. కుమారుడు తమ కుటుంబానికి ఆసరాగా నిలబడతాడనుకుంటే మృత్యువు కబళించిందని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

గోరుకంటి కార్తిక్... ఘట్కేసర్ మండలం కొండాపురం గ్రామం కాగా... కుటుంబ సభ్యులందరూ సమీప బంధువుల ఇంట్లో వివాహానికి వెళ్లారు. కార్తిక్​ను కూడా వివాహానికి రమ్మని పిలవగా మిత్రుని సోదరి వివాహానికి వెళ్తానని చెప్పి వెళ్లి మృత్యువాత పడ్డాడు. తమతో పాటు బంధువుల ఇంట్లో వివాహానికి వచ్చి ఉంటే కార్తిక్ ప్రాణాలు నిలబడేవని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

పన్నాల కల్యాణ్ రెడ్డిది నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం కొల్లిపాక గ్రామం. ఘట్కేసర్​లో ప్రైవేట్ హాస్టల్​లో ఉంటూ చదువుకుంటున్నాడు. తండ్రి వ్యవసాయం చేస్తూ కల్యాణ్ రెడ్డిని, చిన్న కుమారుడిని చదివిస్తున్నాడు. చింతల వెంకటేశ్​... తండ్రి కుషాయిగూడలో ఓ చిన్న షాపు నిర్వహించుకుంటూ వెంకటేశ్​ని చదివిస్తున్నాడు.

మధ్యతరగతి వారు...

వీరంతా మధ్యతరగతి, దిగువ మధ్య తరగతికి చెందిన వారే. ఈ ప్రమాదంలో గాయపడిన హర్షవర్ధన్ ప్రస్తుతం తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా... సాయికిరణ్ హైదరాబాద్​లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అఖిల్ రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆసుపత్రి మార్చురీ వద్ద మృతుల స్నేహితులు వచ్చి రవికిరణ్, కల్యాణ్ రెడ్డి, కార్తిక్, వెంకటేశ్​లతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డారు.

ఇదీ చూడండి: మూడు వాహనాల బీభత్సం... నలుగురు యువకుల దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.