యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషన్ అభియాన్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలింతలు, గర్భిణీలు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకున్న రోజే ఆరోగ్య తెలంగాణ సాద్యమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై 2100 కోట్ల భారం పడుతునప్పటికీ... ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ముందుకు తీసుకెళ్లాడాని కృషి చేస్తోందని వివరించారు. రక్తహీనత అంశంపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాచరచన పోటీల్లో ప్రతిభ కనబరిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సామూహిక సీమంత కార్యక్రమంలో పాల్గొని గర్భిణీ స్త్రీలకు పూలు, పండ్లు, గాజులు, నూతన వస్ర్తాలు అందజేసి ఆశీర్వదించారు.
ఇవీ చూడండి: అలా వరదలో కొట్టుకుపోయాడు... ఇలా బయటకొచ్చాడు