యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో "పిలుపు" సంస్థ ఆధ్వర్యంలో.. పేద ప్రజలకు నిత్యావసర సరకులను అందజేశారు. కరోనా వైరస్ నిర్మూలనకు తమ వంతు సహకారం అందిస్తున్న జర్నలిస్టులకు బియ్యం పంపిణీ చేశారు.
తుర్కపల్లిలో 27 ఏళ్లుగా "పిలుపు" సంస్థ పని చేస్తోందని.. ఆపదలో ఉన్నవారికి దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రుద్రమదేవి పేర్కొన్నారు. కోవిడ్ -19 వైరస్ వల్ల బాధపడుతున్న పేదవారిని గుర్తించి తమ సంస్థ తరఫున ఆదుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన.. నియమాలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలను కోరారు.
ఇదీ చూడండి: దూరంగా బెంచీలు... సగంమందే విద్యార్థులు