యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని పాతబస్టాండ్ ఎస్బీఐ బ్యాంకు సమీపంలో రాయగిరికి చెందిన శ్రీకాంత్ రెడ్డి బహిరంగంగా ఉమ్మాడు. అక్కడే ఉన్న పోలీసులు గమనించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఐపీసీ 188, 269 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ సుధాకర్ వెల్లడించారు.
బహిరంగంగా ఉమ్మితే రూ. 200 నుంచి రూ.1000 జరిమానా లేదా నెల నుంచి 6 నెలల వరకు జైలు శిక్ష విధిస్తారని పేర్కొన్నారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయటం మానుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: తెలంగాణ, ఏపీల్లో హాట్‌స్పాట్ జిల్లాలివే..