యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాంపేటలో డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో 150 మంది పోలీసుల బృందం నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు చూపని 25 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు గుట్కా విక్రేతలను అదుపులోకి తీసుకున్నారు. ఆ గ్రామంలో ఒక్క బెల్ట్ షాపూ ఉండకపోవడం వల్ల ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని డీసీపీ సూచించారు.
ఇదీ చూడండి:కంపా నిధులు విడుదల చేసిన కేంద్రం