ETV Bharat / state

మహమ్మారితో పోరాడుతున్న పోలీసులు, వైద్యులు - ప్రాణాలు తెగించి పోరాడుతున్న పోలీసులు, వైద్యులు

కరోనా రక్కసిని ముందు వరుసలో నిలబడి వైద్యులు, పోలీసులు ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. స్వీయస్థైర్యమే ఆయుధంగా తిరిగి విధుల్లో చేరి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

police-and-doctors-battling-with-coronavirus
మహమ్మారితో పోరాడుతున్న పోలీసులు, వైద్యులు
author img

By

Published : May 6, 2021, 11:04 AM IST

కరోనాకు వెరవకుండా పోలీసులు, వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే ఆయా శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది మహమ్మారి బారిన పడుతున్నారు. కొంతమంది స్వల్ప లక్షణాలతో స్వీయ గృహ నిర్భందంలో ఉండి చికిత్స పొందుతున్నారు. మరికొంత మంది ఆసుపత్రుల వరకు వెళ్లాల్సి వస్తుంది. పూర్తిగా కరోనా నుంచి కోలుకున్న తర్వాత దైర్యంగా తిరిగి విధులకు హాజరవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనాతో పోరాడుతున్న వైద్య, పోలీసు శాఖ సిబ్బందిపై కథనం..

వైద్య ఆరోగ్య శాఖలో..

* సూర్యాపేట జనరల్‌ ఆసుపత్రిలో మొత్తం 70 మంది వైద్యులు ఉన్నారు. వీరిలో పది మంది వైద్యులు కొవిడ్‌ బారిన పడ్డారు. వీరిలో ఆరుగురు తిరిగి విధుల్లో చేరారు. పదిహేను మంది సిబ్బందిదీ అదే పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన సుమారు వందకుపైగా సిబ్బంది కొవిడ్‌ బారిన పడ్డారు. యాభై శాతం మంది సిబ్బంది కోలుకొని తిరిగి విధుల్లో చేరారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలోని ఏడుగురు సిబ్బంది ప్రస్తుతం వైరస్‌తో స్వీయ గృహ నిర్భందంలో ఉన్నారు.

* యాదాద్రి భువనగిరి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన 82 మంది వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో 60 మంది కోలుకొని తిరిగి విధుల్లో చేరగా.. మరో 22 మంది చికిత్స పొందుతున్నారు.

* నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో 12 మంది వైద్యులు వైరస్‌ బారిన పడినట్లు సమాచారం. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన మరో 17 మందిదీ ఇదే పరిస్థితి.

పోలీసు శాఖలో...

* సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్‌ పోలీసు శాఖను పట్టిపీడిస్తోంది. ఇప్పటి వరకు ఇద్దరు కానిస్టేబుల్‌లు, ఒక ఏఎస్సై మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం జిల్లాలోని ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు, ఒక ఎస్సై, సుమారు 60 మంది సిబ్బంది కరోనాతో పోరాడుతున్నారు.

* యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసు శాఖను కరోనా భయం వెంటాడుతోంది. ఒక్కో ఠాణాలో ఒకేసారి ఇద్దరు, ముగ్గరికి కరోనా సోకుతుంది. భువనగిరి పోలీస్​స్టేషన్లో ఒక ఏఎస్సై, ముగ్గురు సిబ్బంది ఒకేసారి కరోనా బారిన పడ్డారు. వీరితోపాటు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు, ఎన్నికల సందర్భంగా బందోబస్తు విధులు పలువురు సిబ్బంది కరోనా సోకింది.

* నల్గొండ జిల్లాకు చెందిన నలుగురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు.

ప్రత్యక్షంగా వైద్యులు.. పరోక్షంగా పోలీసులు

కరోనా కట్టడికి వైద్య, ఆరోగ్య శాఖ పత్యక్షంగా.. పోలీసులు పరోక్షంగా పోరాడుతున్నారు. ముందు వరుసలో నిలబడి విధి నిర్వహణకు పాటుపడుతున్నారు. కరోనా బారిన పడిన బాధితులకు వైద్యులు, సిబ్బంది మెరుగైన సేవలు అందింస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణ, టీకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరోవైపు పోలీసులు రాత్రి వేళ కర్ఫ్యూను పక్కాగా అమలు చేస్తున్నారు. మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న వారికి జరిమానాలు విధిస్తున్నారు. కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 6,026 కరోనా కేసులు, 52మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.