ETV Bharat / state

అకాల వర్షం... కొట్టుకు పోయిన ధాన్యం - తెలంగాణలో వర్షానికి తడిచిన ధాన్యం

రాష్ట్రంలో పలు చోట్ల కురిసిన అకాల వర్షాలు.... రైతులను నష్టాల పాలు చేశాయి. మార్కెట్‌యార్డులో విక్రయించడానికి తెచ్చిన ధాన్యం.... వానకు తడిచిపోయింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాష్ట్రంలో రాగల రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన పడే అవకాశం ఉందని... హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

telangana rains
rain in telangana
author img

By

Published : May 5, 2021, 10:58 PM IST

మెదక్‌ జిల్లాలోని పలు మండలాల్లో భారీవర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో అరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది. అరుగాలం కష్టపడి పండించిన పంటల నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యాన్ని కొనేందుకు మార్కెట్ అధికారులు సవాలక్ష కారణాలు చూపుతూ ఆలస్యం చేయడం వల్లనే కొనుగోలు కేంద్రంలోనే రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

చేతికొచ్చిన పంట
చేతికొచ్చిన పంట

తుర్కపల్లిలో దంచి కొట్టింది

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. వర్షానికి పీఏసీఎస్ కేంద్రాలలో ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. కల్లాల్లో ఆరబెడ్డిన ధాన్యం నీటిపాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలకల్‌పల్లి గ్రామంలో పిడుగుపడి కొబ్బరి చెట్టు దగ్ధమైంది.

భాగ్యనగరంలో జోరు వాన

హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. కోఠి, బేగంబజార్, సుల్తాన్​ బజార్, అబిడ్స్, సైఫాబాద్, లక్డీకాపూల్​, బషీర్ బాగ్, నారాయణ గూడ, హిమాయత్ నగర్, లిబర్టీ, అసెంబ్లీ తదితర ప్రాంతాలలో కురిసిన వర్షానికి రోడ్లపై నీరు నిలిచి... వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు.

వచ్చే రెండు రోజులు వర్షాలే...

రాష్ట్రంలో రాగల రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈప్రభావం ఉంటుందని తెలిపింది. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశాలున్నాయని తెలిపారు. కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల నుంచి దక్షిణ కేరళ వరకు సముద్రమట్టానికి 0.9కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని ఐఎండీ సంచాలకులు వివరించారు.

ఇదీ చూడండి: రైల్వే సిబ్బందికి అదనపు పడకలు ఏర్పాటు చేయాలి: గజానన్​ మాల్యా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.