యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ చెరువు కట్ట సమీపంలో ద్విచక్ర వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. భువనగిరి పట్టణానికి చెందిన శంకర్ అనే వ్యక్తి పని నిమిత్తం బైక్‌పై బీబీనగర్ వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యాడు.
హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై బీబీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద సాయంత్రం వాకింగ్ కోసం వెళ్తున్న యువకున్ని శంకర్ బైక్‌తో వెనకనుంచి ఢీ కొట్టాడు. వాకింగ్ చేస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి వివరాలు తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: బుద్ధుని బోధనలు సర్వదా అనుసరణీయం: మోదీ