Yadadri brahmotsavalu 2022: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా వివిధ అవతారాలలో అలంకరించి ఉదయం, సాయంత్రం ఊరేగిస్తున్నారు. బుధవారం స్వామివారు గోవర్ధనగిరిధారి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
హైదరాబాద్కు చెందిన వీణా సుధాకర్ రావు దంపతులు స్వామివారి విమాన గోపురం బంగారు తాపడంకు రూ.54 లక్షల చెక్కును విరాళంగా ఆలయ ఈవో గీతకు అందించారు.
![The Yadadri air tower is heavily donated for the gold plating](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14682675_check.jpg)
ఇదీ చదవండి: యాదాద్రిలో ఆలయ ప్రాకార మండప విమానాలపై కలశాలు బిగింపు..