లాలిస్తూ... ఆడిస్తూ...!
ప్రతి సంవత్సరం ఒకరోజు గ్రామంలోని పాఠశాల పిల్లలందరిని తన ఇంటికి పిలిచి వారికి ఆటలపోటీలు నిర్వహిస్తుంది. పిల్లలు ఇష్టపడే అన్ని రకాలు ఆటలను వారితో ఆడిస్తుంది. పాటలు పాడించడం, నృత్యాలు చేయించి.. తనూ మైమరిచిపోతుంది. ఆ చిన్నారుల ముద్దు ముద్దు మాటలకు మురిసిపోయే బామ్మ... పసిమొగ్గల చిలిపి అల్లరికి పరవశించిపోతుంది. పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు ఇచ్చి.. చిన్నారులకు మిఠాయిలు, పాయసం పంచి పెడుతూ...వారిని ప్రేమతో అక్కున చేర్చుకుంటోంది.
చిన్నారులకు పండగే...!
ఆటపాటలే కాకుండా ఆ చిన్నారులకు పెన్నులు, పుస్తకాలు, పెన్సిళ్లు అందిస్తోంది. పాఠశాల ఫీజులు కట్టలేని కొందరికి బామ్మే చెల్లిస్తోంది. బామ్మంటే ఎంతో ఇష్టపడే చిన్నారులు... ఆమె ఊళ్లో అడుగుపెడుతుందంటే చాలు అల్లుకుపోతారు.సొంత వాళ్లనే కాదు పొమ్మంటున్న ఈ రోజుల్లో ఊళ్లోని పిల్లలను అక్కున చేర్చుకుంటూ.. ఆడిపాడిస్తున్న బామ్మ అందరి మన్ననలు అందుకుంటోంది.
ఇవీ చూడండి:ఊహించినట్లే జరిగింది