Yadadri temple: యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో.. ఇక నిరంతర నిఘా కోసం పోలీసు శాఖకు చెందిన భద్రతా సిబ్బంది కసరత్తులు చేస్తోంది. తిరుమల - తిరుపతి తరహాలో స్కానింగ్ బృందాల ఏర్పాట్లు జరగనున్నాయి. బాంబ్ స్క్వాడ్ జిల్లా ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, స్వస్తిక్ ఇనిస్టిట్యూట్ నిపుణులతో.. యాదాద్రి క్షేత్ర పరిసరాలను పరిశీలించారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు జరగకుండా తగు భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని.. సీఎం కేసీఆర్ గతంలోనే సూచించారు.
ఆ క్రమంలోనే నిరంతర నిఘా, భద్రతా చర్యల్లో భాగంగా ముందస్తు జాగ్రత్తల కోసం పోలీసు శాఖ, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాలతో క్షేత్ర పరిధిలో తనిఖీ, సోదాలు కొనసాగించేందుకు.. వెహికల్ స్కానింగ్, బాంబ్ స్క్వాడ్ బృందాల ఏర్పాట్లకు అధికారులు యత్నిస్తున్నారు. ఆలయ ఈవోతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: