యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం కన్నులుపండువగా సాగింది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య బాలాలయంలో జరిగిన ఈ వేడుకకు గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరై పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.లక్ష్మీ సమేత నరసింహుని కల్యాణ దృశ్యాలు తిలకించిన భక్తులు తన్మయత్వం చెందారు. ఉదయం పంచనారసింహుడు గజ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
బాలాలయంలో జరిగిన ఈ వేడుకను అందరూ ప్రత్యక్షంగా తిలకించేందుకు అవకాశం లేనందున.. రాత్రికి కొండ కింద గల జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో మరోసారి కల్యాణం జరిపేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.
ఇవీ చదవండి :పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతులు