యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సెలవు దినాల్లో రద్దీగా ఉండే ఆలయ పరిసరాల్లో సందడి తగ్గింది. కొవిడ్ దృష్ట్యా భక్తులకు లఘు దర్శనం కల్పిస్తున్నారు ఆలయ అధికారులు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారిని దర్శించుకుంటున్నారు భక్తులు.
సెలవు దినాలలో ఎప్పుడూ సందడిగా ఉండే ఆలయ పరిసరాలు ఘాట్ రోడ్డు, ప్రసాదాల కౌంటర్లు, కల్యాణ కట్ట వద్ద రద్దీ తగ్గింది. స్వామివారి సుదర్శన నారసింహహోమం, కల్యాణం, సువర్ణ పుష్పార్చన పూజలు, వివిధ ఆర్జిత సేవలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
కొవిడ్ దృష్ట్యా శుద్ధి చర్యలు
కొవిడ్ విజృంభణ దృష్ట్యా యాదాద్రి దేవస్థానం అధికారులు అప్రమత్తతంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు బాలాలయం ముఖ మండపంలో, దర్శనం వరుసలు, కల్యాణోత్సవం, అష్టోత్తరం నిర్వహించే మండపాలలోను శుద్ధి చర్యలు నిర్వహిస్తున్నారు.