యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో అంగడి బజార్లో ఉన్న ఏడు బుడగ జంగాల కుటుంబాలు కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయాయి. వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గ్రహించిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నిహారిక రెడ్డి ముందుకొచ్చారు.
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన నిహారిక రెడ్డి ఆర్థిక సాయంతో నెలకు సరిపడ బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పిల్లలకు చెప్పులు అందజేశారు. లబ్ధి పొందిన ఏడు కుటుంబాలు ఈ విపత్తు సమయంలో ఆదుకున్న నిహారికరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొత్త పోర్టల్