ETV Bharat / state

ప్రమాదంలో నూతన దంపతుల మృతి - నూతన దంపతులు

పెళ్లై నెల రోజులు కూడా కాలేదు. వివాహ బంధంతో జీవితాంతం కలిసి ఉంటామని ప్రతిజ్ఞ చేసుకున్న ఆ దంపతులు రోడ్డు ప్రమాదంతో చావులో ఒక్కటయ్యారు. ఇంట్లో పెళ్లి సందడి ఇంకా తీరక ముందే వారు మృత్యు ఒడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు గుండెలవిసేలా రోదించారు. ఈ విషాద ఘటన యాదాద్రి జిల్లాలో చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదం
author img

By

Published : Mar 11, 2019, 12:15 PM IST

దంపతుల మృతితో శోకసంద్రంలో బంధువులు
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం కుమ్మరిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న నవత ట్రాన్స్​పోర్ట్​ లారీని ద్విచక్రవాహనం ఢీ కొట్టిన ఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు.

పెళ్లి సందడిలో మృత్యుఘోష

మృతులు గుండాల మండలం బ్రహ్మణపల్లికి చెందిన నరేష్​, కేసారం గ్రామానికి చెందిన దివ్యగా గుర్తించారు. వీరికి గత నెల 20న వివాహమయ్యింది. నూతన దంపతులు చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి :కశ్మీర్​లో కాల్పులు​...ముగ్గురు తీవ్రవాదులు హతం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.