ETV Bharat / state

మానవ మృగానికి మరణ దండన

అతడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు.. ఆడ పిల్లలకు లిఫ్ట్​ ఇస్తానని నమ్మించి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి హత్యాచారం చేసిన మానవ మృగం. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు మర్రి శ్రీనివాస్​ రెడ్డికి నల్గొండ న్యాయస్థానం మరణ దండన విధించింది. రెండు కేసుల్లో ఉరి, మరో కేసులో జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఉదయం నుంచి ఉత్కంఠ నెలకొనగా.. కోర్టు సాయంత్రం తీర్పు వెలువరించింది.

nalgonda pocso court death sentenced to hajipur offender srinivas reddy
మానవ మృగానికి మరణ దండన
author img

By

Published : Feb 7, 2020, 6:25 AM IST

మానవ మృగానికి మరణ దండన

ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి చంపిన కేసులో నిందితుడు శ్రీనివాస్​ రెడ్డికి మరణ శిక్ష పడింది. రెండు కేసుల్లో ఉరి శిక్ష పడగా మరో కేసులో జీవితఖైదు పడింది. మధ్యాహ్నం దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం సాయంత్రం తీర్పు వెల్లడించింది.

11ఏళ్ల బాలికపై అత్యాచారం

2015 ఏప్రిల్ 22న ఒంటరిగా వెళ్తున్న 11ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం హత్య చేసి మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి పాడుబడ్డ బావిలో పడేశాడు. ఈ కేసులో పోలీసులు 36మంది సాక్ష్యులను విచారించారు. వైద్యపరమైన ఆధారాలతో పాటు... సాంకేతిక ఆధారాలను సేకరించి ఛార్జీషీట్ దాఖలు చేశారు.

బావిలోకి దిగి మరి

గతేడాది మార్చి 7న హాజీపూర్ నుంచి బొమ్మలరామారానికి కాలినడకన వెళ్తున్న 17ఏళ్ల యువతికి శ్రీనివాస్ రెడ్డి లిఫ్ట్ ఇచ్చాడు. మార్గమధ్యలో ద్విచక్ర వాహనాన్ని దారి మళ్లి తన వ్యవసాయ పొలం వైపు తీసుకెళ్లాడు. ఆ యువతి కేకలు వేయడం వల్ల అమ్మాయి నోరు, ముక్కు గట్టిగా అదిమిపట్టటంతో... అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అయినా వదలని ఆ రాక్షసుడు అత్యాచారం చేసి బావిలో పడేశాడు.

చావుబతుకుల్లో ఉన్న యువతిపై

బావిలోకి దిగిన శ్రీనివాస్ రెడ్డి మరోసారి చావుబతుకుల్లో ఉన్న యువతిపై అత్యాచారం చేశాడు. యువతి మృతి చెందిందని నిర్ధరించుకున్న తర్వాత ఆమె మృతదేహాన్ని తగులబెట్టాడు. ఆధారాలు దొరకనీయొద్దనే ఉద్దేశంతో తన ప్యాంటు, చొక్కాను కూడా అదే మంటల్లో వేసి నిప్పంటించాడు. ఈ కేసులో 34 మంది సాక్ష్యులను విచారించిన భువనగిరి పోలీసులు, సాంకేతిక ఆధారాలను సేకరించి న్యాయస్థానంలో నేరాభియోగపత్రం దాఖలు చేశారు.

లిఫ్ట్​ ఇస్తానని నమ్మించాడు

తిరిగి 50రోజుల తరువాత మరో ఘాతుకానికి పాల్పడ్డాడు. ఏప్రిల్ 25న హాజీపూర్ వెళ్లడానికి బొమ్మలరామారం వద్ద వేచి ఉన్న 14 ఏళ్ల బాలికకు తన వాహనంపై లిఫ్ట్ ఇచ్చాడు. దారి మధ్యలో బాలికను తన వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లిన శ్రీనివాస్ రెడ్డి లైంగిక దాడి చేశాడు. బాలిక కేకలు వేయడం వల్ల ఊపిరాడకుండా చేసి అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేశాడు. తరువాత బావిలో పడేసి బాలికపై అత్యాచారం చేశాడు.

మూడు హత్యలే కాకుండా...

బాలిక చున్నీనే గొంతుకు బిగించి చంపేశాడు. మృతదేహాన్ని తగులబెట్టి.... అందులోనే తన దుస్తులు వేశాడు. ఈ కేసులో 58మంది సాక్ష్యులను విచారించి పోలీసులు.. ఆధారాలు సేకరించి నేరాభియోగపత్రం దాఖలు చేశారు. శ్రీనివాస్ రెడ్డి ఈ మూడు హత్యలే కాకుండా... కర్నూలులో 2016లో మహిళను హత్య చేశాడు. 2015లో బొమ్మలరామారం ఠాణా పరిధిలోనూ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు.

పకడ్బందీగా ఆధారాల సేకరణ

మూడు హత్యల్లోనూ ప్రత్యక్ష సాక్ష్యాలేవీ లేకపోవడం పోలీసుల దర్యాప్తునకు ఆటంకంగా మారింది. పోలీసులు శాస్త్రీయ, వైద్యపరమైన, సాంకేతిక ఆధారాలు, వేలిముద్రలు పకడ్బందీగా సేకరించారు. ఘటనా స్థలంలో సేకరించిన డీఎన్ఏను శ్రీనివాస్ రెడ్డి డీఎన్ఏను ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపారు. రెండు డీఎన్ఏలు సరిపోవడం వల్ల కేసుకు మరింత బలం చేకూరింది. మృతి చెందిన బాలికలు చదివిన పాఠశాలల్లోని తోటి విద్యార్థుల నుంచి కొంత సమాచారాన్ని సేకరించారు.

101 మంది సాక్ష్యులను విచారణ

నిందితుడు శ్రీనివాస్ రెడ్డి చరవాణిని సాంకేతికంగా విశ్లేషించి ఆయన ఏ సమయంలో ఎక్కడ ఉన్నాడనే ఆధారాలను సేకరించారు. శ్రీనివాస్ రెడ్డి ఈ హత్యలకు పాల్పడినట్లు నిరూపించారు. 2019 అక్టోబర్​లో నల్గొండలోని న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. జనవరి 17న సాక్ష్యుల విచారణ పూర్తైంది. 101 మంది సాక్ష్యులను విచారించిన న్యాయస్థానం.. నిందితుడికి ఉరి శిక్ష విధించింది.

నిందితుడికి శిక్ష పడడం పట్ల హాజీపూర్​ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. పోలీసులను అభినందించారు. తీర్పుపై డీజీపీ మహేందర్​ రెడ్డి, సీపీ మహేశ్​ భగవత్​ స్పందించారు. నిందితుడికి శిక్ష పడేందుకు సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

కేవలం దర్యాప్తులోనే కాకుండా రాచకొండ సీపీ మహేశ్ భగవత్... బాధిత కుటుంబాలను ఆదుకునే విధంగానూ చొరవ తీసుకున్నారు. భువనగిరి కలెక్టర్ సాయంతో మహిళ, శిశసంక్షేమ శాఖ ద్వారా ఆర్థిక సాయం అందేలా చేశారు. నిర్మానుషంగా ఉన్న హాజీపూర్ రహదారిపై సీసీ కెమెరాలను పోలీస్ శాఖ తరఫున ఏర్పాటు చేయించారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు.

ఇదీ చదవండి:మద్యం ఊరికే రాదు... మరి ఇలా కుళాయిల్లో వస్తే.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.