రాష్ట్రంలో ఇటీవల ప్రవేశపెట్టిన ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని మహజన విద్యార్థుల యూనియన్ (ఎంఎస్యూ), ఎంఎస్ ఎప్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ వర్సిటీలను తీసుకొచ్చారని.. తక్షణమే ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ బిల్లు వల్ల పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతారని యూనియన్ నాయకులు ఆరోపించారు. ఎంఎస్యూ, ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పల్లెపల్లెకు పాదయాత్ర వెళ్లి ఇంటింటికి తిరుగుతూ.. కేసీఆర్ పేదవర్గాల బిడ్డలకు చేస్తున్న అన్యాయాన్ని వివరించి సీఎం పతనాన్ని చూసేందుకు ఉద్యమాన్ని సిద్ధం చేస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి: ప్రియాంక గాంధీపై చేయి వేయడానికి ఎంత ధైర్యం: భాజపా