యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలోని శ్రీశ్రీశ్రీ ఆదిజాంబవంతుని మఠం అభివృద్ధికోసం నిర్వహించిన సదస్సులో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఆదిజాంబవంతుని మఠం అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. 2023 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని... తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలోని 18 కులాల మఠాలను అభివృద్ధి చేస్తామన్నారు.
కొలనుపాకను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి నేరవేర్చలేదని ఆరోపించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు తుడుం గణేష్, మాజీ సర్పంచ్ మోత్కూరి ఐలయ్య, ఆలేరు మండల ఎంపీపీ గంధముళ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గణేషుడికీ ఓ పార్కు, మ్యూజియం ఉన్నాయి.. అవి ఎక్కడో తెలుసా!