ETV Bharat / state

కోమటిరెడ్డితో రేవంత్‌రెడ్డి మొదటిసారి భేటీ.. ఆ విషయాలపై చర్చ - Revanth reddy - Komati Reddy Meet

Revanth - Komati Reddy Meet: ఆ ఇద్దరు కాంగ్రెస్​ పార్టీలో కీలక నేతలు. ఒక్కరంటే ఒకరికి పడదు. వారు ఇరువురు కలిసి మాట్లాడుకున్న సందర్భాలు తక్కువే. ఆ ఇద్దరు కూడా ఒకే పదవి కోసం శాయశక్తులా యత్నించారు. కానీ ఒకరికే ఆ పదవి దక్కింది. ఒకరు కాంగ్రెస్​ను వీడిపోతారేమో అని కార్యకర్తలు, అధిష్ఠానం అనుకున్నారు. ఆ ఇద్దరు ఎవరూ అని అనుకుంటున్నారా.. ఇంకెవరో కాదు టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి(tpcc chief revanth reddy), భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి(komatireddy)లు. ఇప్పుడు వారిద్దరు హైదరాబాద్​లో భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది.

Revanth - Komati Reddy Meet:
Revanth - Komati Reddy Meet:
author img

By

Published : Feb 15, 2022, 1:51 PM IST

Updated : Feb 15, 2022, 3:36 PM IST

Revanth - Komati Reddy Meet: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి.. భువనగిరి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సమావేశయ్యారు. హైదరాబాద్‌లో తన నివాసానికి వచ్చిన రేవంత్‌రెడ్డికి.. వెంకట్‌రెడ్డి స్వాగతం పలికారు. కోమటిరెడ్డితో భేటీకి సంబంధించిన ఫోటోలను రేవంత్‌రెడ్డి.. హ్యాపీ టైమ్స్‌ అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. కోమటిరెడ్డి సైతం ట్విట్టర్‌లో ఫోటోలు పంచుకున్నారు. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించామని తెలిపారు. తమ భేటీకి సంబంధించిన ఫోటోలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కలిసి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కోమటిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తాజా రాజాకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిపారు. కేసీఆర్‌ పాలనలో ప్రజలకు ఓరిగిందేమి లేదని ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఉద్యోగ నోటిఫికేషన్‌కు కేటీఆర్‌ చొరవ చూపాలని సూచించారు. ఆ తర్వాత 3 రోజులు కాకుంటే వారం వేడుకలు జరుపుకున్న అభ్యంతరం లేదని ఎద్దేవా చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతున్నట్లు వెల్లడించారు.

పీసీసీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలకు సహకరిస్తాం. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రైతులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ చేసే అరాచకాలను అడ్డుకుంటాం. అందరం కలిసి పనిచేస్తాం. పీసీసీ ,సీనియర్ నాయకుల నిర్ణయం ప్రకారం నడుచుకుంటాం. కేసీఆర్ జన్మదిన ఉత్సవాలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలి.

- కోమటిరెడ్డి, ఎంపీ

రేపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసనలు చేస్తామని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఎస్పీ కార్యాలయాలు, కమిషనరేట్‌ల వద్ద ధర్నాలు చేపడతామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్పీ కార్యాలయాల వద్ద ధర్నా చేస్తామన్నారు. అసోం సీఎంపై ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

మా ఫిర్యాదులపై పోలీసులు రేపటిలోగా కేసు నమోదు చేయాలి. పోలీసుల తీరును నిరసిస్తూ రేపు కాంగ్రెస్‌ ఆందోళనలు. రేపు హైదరాబాద్ పోలీస్‌ కమిషనరేట్ ఎదుట నేను బైఠాయిస్తా... రాచకొండ కమిషనరేట్ వద్ద ధర్నాలో కోమటిరెడ్డి పాల్గొంటానన్నారు.

- రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత కోమటిరెడ్డి అలకబూనారు. పీసీసీ అధ్యక్ష పదవి ఆశించినా.. దక్కలేదని మనస్తాపం చెందారు. తాను నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతామని స్పష్టం చేశారు. పార్టీ వ్యవహాల్లోనూ అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ జనగాం, యాదాద్రి పర్యటనలోనూ స్థానిక ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. అధికారిక కార్యక్రమమే అయినా ఇది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. పీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్‌ సోనియాతో పాటు రేవంత్‌రెడ్డి ఇతర ముఖ్యనేతలకు ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి తెరాసతో స్నేహంగా మెలుగుతున్నారని.. ఫలితంగా పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఫిర్యాదు లేఖలో ప్రస్తావించారు. ఈ పరిణామాల అనంతరం తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. కోమటిరెడ్డితో సమావేశం కావడం ప్రధాన్యం సంతరించుకుంది.

ఆనందంలో అభిమానులు

ఇద్దరు ఎంపీలు కలుసుకోవడం.. కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు సంతోష పడుతున్నారు. భవిష్యత్​లో కలిసి పార్టీని ముందుకు నడిపించేందుకు కృషి చేస్తారా?.. భేటీ అయ్యాకా ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోతారా?.. అనేది రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది.

కోమటిరెడ్డితో రేవంత్‌రెడ్డి మొదటిసారి భేటీ.. ఆ విషయాలపై చర్చ

ఇదీ చూడండి: revanth-komati reddy: ఒకే వేదికపై రేవంత్​ రెడ్డి, కోమటిరెడ్డి.. కార్యకర్తల్లో సంబరం

Last Updated : Feb 15, 2022, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.