మూడు మర్డర్ కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగదీశ్ రెడ్డి మంత్రా అని ప్రశ్నించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాలోని బస్వపురం జలాశయం ఇంకా పునాది దశలోనే ఉందని, గంధమల్ల ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుల పేరుతో గెలిచిన జిల్లా ఎమ్మెల్యేలు నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆలేరు సాగు నీటి కోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. ఇప్పటికే భువనగిరి నియోజకవర్గానికి రూ. 85 కోట్లు ప్రధానమంత్రి సడక్ యోజన కింద మంజూరయ్యాయని వెల్లడించారు. భువనగిరి, ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సిద్దిపేట, గజ్వేల్‌లో చెరువులు నింపగానే రాష్ట్రమంతటా నీళ్లు వచ్చినట్లు కాదన్నారు. కొండపోచమ్మ ద్వారా లిఫ్ట్ పెట్టి చెరువులు నింపుకుంటున్నారన్నారు. ఇక్కడ బస్వపురం నుంచి గ్రావిటీ కాల్వల ద్వారా నీరు వెళ్లేలా నిర్మిస్తామని చెబుతున్నారని తెలిపారు.
దేశంలో తెలంగాణ మోడల్ అని చెప్పుకునే సీఎం కేసీఆర్ ఈ రోజు సీఓటీ సర్వేలో 16వ స్థానంలో ఉన్నారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. దక్షిణ తెలంగాణ ఎడారిగా మార్చిన 203 జీవోను ఏపీ సీఎం జగన్ తీసుకురాలేదు. దానికి కేసీఆరే పాత్రదారి. మంత్రి జగదీశ్ రెడ్డి అక్రమ ఇసుక వ్యాపారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నెలకు రూ. 5కోట్లు సంపాదిస్తున్నారు.మూడు మర్డర్ కేసులో ముద్దాయిగా ఉన్న జగదీశ్ రెడ్డి మంత్రి అంటే సిగ్గుపడాల్సిన విషయం -కోమటిరెడ్డి వెంకట రెడ్డి,భువనగిరి ఎంపీ
ఇదీ చూడండి: భక్తులకు మనవి..ఆలయాల్లో ఇవి పాటించండి..!