ఏఐసీసీ ఆదేశాల మేరకు వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ... స్వయంగా సంతకం పెట్టి యాదగిరిగుట్టలో రెండు కోట్ల సంతకాల సేకరణ ఉద్యమాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఆలేరు ఇంఛార్జ్ బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
వ్యవసాయ బిల్లులతో ప్రధాని మోదీ, కొత్త రెవెన్యూ చట్టం పేరుతో సీఎం కేసీఆర్... రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల పట్ల ప్రేమ ఒలకబోస్తున్న కేసీఆర్.... ఎల్ఆర్ఎస్ పేరుతో పేదల రక్తాన్ని తాగుతూ రైతులు, ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రభుత్వమే చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్పై ఇప్పటికే హైకోర్టుకు వెళ్లామని... అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రజలకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు.